News November 18, 2024

NLG: జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

image

NLG జిల్లాలో రోజురోజుకి చలి తీవ్రత ఎక్కువ అవుతుంది. గత మూడు రోజుల క్రితం 27 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా 20 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ఉదయం 8 గంటల వరకు ఒక్కరు కూడా ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. వృద్ధులు చలి తీవ్రతకు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల సమయం దాటిందంటే చాలు చలి మొదలవుతుందని స్థానికులు తెలిపారు.

Similar News

News November 21, 2024

NLG: ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సిఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా వేసిన ఈ పరీక్షలను డిసెంబర్ 7వ తారీకు నుంచి నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఐదవ సెమిస్టర్ పరీక్షలను మధ్యాహ్నం నిర్వహిస్తామని వెల్లడించారు.   

News November 21, 2024

గత ప్రభుత్వం జాతీయ రహదారుల గురించి పట్టించుకోలేదు: కోమటిరెడ్డి

image

గత ప్రభుత్వం పదేండ్లలో జాతీయ రహదారుల నిర్మాణాల గురించి పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కుంటుపడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారన్నారు. బంజారహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో జాతీయ రహదారులపై నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు.

News November 20, 2024

నాగార్జునసాగర్ పర్యాటక రంగానికి మహర్దశ!

image

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాగార్జునసాగర్ పర్యాటక రంగానికి మహర్దశ పట్టనుంది. రూ.100 కోట్లతో సాగర్‌తో పాటు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా అనువైన చోట స్టార్ హోటల్స్, కాటేజీలు, జలాశయంలో వాటర్ గేమ్స్, స్పీడ్ బోట్లు నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.