News November 18, 2024
శ్రీకాకుళం: కంటైనర్ ఢీకొని ఇద్దరు యువకుల మృతి
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి పాత జాతీయ రహదారిపై ఎల్ మాక్స్ సినిమా థియేటర్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బైక్ను కంటైనర్ ఢీకొనడంతో వంశీ(23) అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన కృష్ణ(27) బరంపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఇచ్ఛాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 26, 2024
శ్రీకాకుళం: ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్షా
జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సబ్ డివిజన్ డీఎస్పీ, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలో పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
News December 26, 2024
శ్రీకాకుళం ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్షురాలిగా పూర్ణిమ
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం జిల్లా, సర్వసభ్య సమావేశం పట్టణంలోని గూనపాలెంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. నూతన జిల్లా కార్యవర్గ ఎంపికలు ఎన్నికల అధికారి శివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన జిల్లా సంఘ అధ్యక్షురాలుగా ఎస్ వి ఎస్ఎల్ పూర్ణిమ, సెక్రటరీగా కె. జగన్ మోహన్ రావు , ట్రెజరర్ గా కె. మాధవరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
News December 26, 2024
శ్రీకాకుళం: దళారులను నమ్మి మోసపోవద్దు-ఎస్పీ
జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీస్ రిక్రూట్మెంట్ గురించి అధికారులతో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని, దళారులను నమ్మవద్దని ఆయన సూచించారు.. శారీరిక దారుఢ్య పరీక్షలు నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. 7390 అభ్యర్థుల్లో 6215 మంది పురుషులు, 1175 మంది మహిళా పాల్గొంటారని పేర్కొన్నారు.