News November 18, 2024

కర్నూలు: కూరలో మాత్రలు కలిపిన విద్యార్థులు.. 9 మంది ఆస్పత్రి పాలు

image

కర్నూలు సీ.క్యాంపులోని ప్రభుత్వ బాలుర వికలాంగుల హాస్టల్‌లో ఇద్దరు అకతాయిలు చేసిన పనికి 9మంది అస్వస్థతకు గురయ్యారు. కూరలో గుర్తుతెలియని మాత్రలు కలపడంతో అది తిన్న వారు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారని జిల్లా వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు రయీస్ ఫాతిమా తెలిపారు. పీజీ విద్యార్థి ఓ 8వ తరగతి విద్యార్థితో కలిసి శనివారం రాత్రి సొరకాయ కూరలో మాత్రలు కలిపారన్నారు. బాధితులను కర్నూలు ఆస్పత్రికి తరలించామన్నారు.

Similar News

News January 16, 2026

కర్నూలు: మద్యం బాబులూ.. మీకు చిత్తడే..!

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

News January 15, 2026

కర్నూలు: ‘యువకుడి మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే చెప్పండి’

image

కర్నూలు(M) పంచలింగాల డెయిరీ ఫారం నిర్వహిస్తున్న బ్రహ్మానంద రెడ్డి(30) నిన్న తెల్లవారుజామున నుంచి కనిపించకుండా పోయాడు. రోజూలాగే పాలు పోసేందుకు వెళ్లిన బ్రహ్మానంద రెడ్డి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. కేసీ కెనాల్ సమీప హైవేపై అతని బైక్ నిలిపి ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు 4వ పట్టణ PSలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ విక్రమ్ సింహ తెలిపారు.