News November 18, 2024
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఇటీవల తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.660 పెరిగి రూ.76,310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.600 పెరిగి రూ.69,950గా నమోదైంది. మరోవైపు సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.99వేలుగా ఉంది.
Similar News
News November 18, 2024
కిరణ్.. ‘క’ మూవీ చూసి కాల్ చేస్తా: అల్లు అర్జున్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ టీమ్‌ను అభినందించారు. ప్రస్తుతం బిజీగా ఉండటం వల్ల సినిమాను చూడలేకపోతున్నా అని, కానీ తప్పకుండా మూవీ చూసి హీరో కిరణ్‌కు ఫోన్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. ‘పుష్ప-2’ ట్రైలర్ బాగుందని కిరణ్ అబ్బవరం చేసిన ట్వీట్‌కు ఐకాన్ స్టార్ ఇలా స్పందించారు.
News November 18, 2024
రేవంత్ పాలనలో 15 ఏళ్లు వెనక్కి: హరీశ్ రావు
TG: రేవంత్ పాలనలో తెలంగాణ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆరు గ్యారంటీలు బంద్ చేసి మూసీ దుకాణం తెరిచారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను నం.1గా మార్చారని చెప్పారు. పేదోళ్లతో పెట్టుకుని రేవంత్ హిట్ వికెట్ చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ఫామ్‌లోకి వస్తారని, బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
News November 18, 2024
వేములవాడ అభివృద్ధికి భారీగా నిధుల విడుదల
TG: ఎల్లుండి సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో వేములవాడకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఆలయ అభివృద్ధి పనులకు రూ.127.65 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు ఆధునాతన సదుపాయాల కోసం రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూల వాగు బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ, భూసేకరణకు రూ.47.85 కోట్లు, స్థానికంగా మేజర్ డ్రైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొంది.