News November 18, 2024

రాజకీయ లబ్ధి కోసమే YCPపై ఆరోపణలు: బొత్స

image

AP: వైసీపీ హయాంలో క్రైమ్ రేట్ పెరిగిందన్న హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. శాంతిభద్రతలపై Dy.CM పవన్ ఆందోళన వ్యక్తం చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనిత వ్యాఖ్యలకు తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు దమ్ము, ధైర్యం అంటూ మంత్రి మాట్లాడటం సరికాదని మండలి ఛైర్మన్ మోషన్ రాజు అన్నారు.

Similar News

News November 18, 2024

నెవర్ బిఫోర్.. T20ల్లో ఇండియా విన్నింగ్ స్ట్రైక్ రేట్ 92.31%

image

ఇటీవల సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా అరుదైన రికార్డును సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్(92.31 శాతం) నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ ఏడాది భారత్ 26 మ్యాచ్‌లకు గాను ఏకంగా 24 టీ20ల్లో గెలిచింది. 2018లో పాక్ 89.43%, 2023లో ఉగాండా 87.88%, 2019లో పపువా న్యూగినియా 87.5%, 2022లో టాంజానియా 80.77% విజయాలు నమోదు చేశాయి.

News November 18, 2024

BIG BREAKING: ఎందరు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే

image

AP: పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. జనాభా వృద్ధి రేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇకపై ఎందరు పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభిస్తుంది. మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందితే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.

News November 18, 2024

హరీశ్ రావు పక్కచూపులు చూస్తున్నారు: TPCC చీఫ్

image

TG: BRSలో ఎవరూ మిగలరని, హరీశ్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితలే ఆ పార్టీలో ఉంటారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జనవరి నుంచి కొంతమందికి పదవులు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.