News November 18, 2024

సీఎం చంద్రబాబుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఫైర్

image

సీఎం చంద్రబాబుపై వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి ఫైర్ అయ్యారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. కర్నూలులో హైకోర్టు, లోకాయుక్త, హెచ్ఆర్‌సీ, లా యూనివర్సిటీ ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటే.. చంద్రబాబు వాటిని అమరావతికి తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

Similar News

News January 25, 2026

ATP: ‘గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలి’

image

77వ గణతంత్ర దినోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ సి.విష్ణు చరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం అనంతపురం నగరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి పోలీసు పరేడ్ మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.

News January 25, 2026

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్ సమీక్ష

image

గణతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. పోలీసు పెరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. పారిశుద్ధ్యం, ఫ్లాగ్ హోయిస్టింగ్, కవాతు, తాగునీరు, సీటింగ్, స్టాల్స్, శకటాల ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదన్నరు.