News November 18, 2024
హిజ్రాల ఆగడాలకు బెంబేలెత్తుతున్న ప్రయాణికులు

మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రయాణికుల నుంచి హిజ్రాలు ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తుండటంతో బెంబేలెత్తుతున్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని క్షేత్రానికి తరలివస్తున్న భక్తుల వాహనాలను ఆపి, 4 చక్రాల వాహనదారుల నుంచి రూ.500, బైకు చోదకుల నుంచి రూ.100 డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని భక్తులు వాపోతున్నారు.
Similar News
News February 28, 2026
కర్నూలు: ‘ఈ ఏడాదికి 45 లక్షల మొక్కలు నాటాలి’

కర్నూలు కలెక్టరేట్‌లో శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే Plantation గురించి జిల్లా కలెక్టర్ సిరి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని, అందుకుగాను 45 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
News February 28, 2026
మార్చి 2న కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

మార్చి 2న ఉదయం 9:30 గంటలకు కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. అర్జీల స్థితిగతుల కోసం 1100 కాల్ సెంటర్ నుంచి సమాచారం పొందవచ్చన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News February 28, 2026
మద్దూర్ నగర్‌లో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలులోని మద్దూర్ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా సరైన సమయానికి పింఛన్ అందుతుందా అని లబ్ధిదారులను అడిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.


