News November 18, 2024

లగచర్ల ఘటనలో A2పై లుకౌట్ నోటీసులు

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న A2 సురేశ్ కోసం గాలిస్తున్నారు. అతడిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనలో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News July 7, 2025

ముల్డర్ సరికొత్త చరిత్ర

image

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ సంచలనం నమోదు చేశారు. అరంగేట్ర టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. 297 బంతుల్లో 38 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. టెస్టుల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతకుముందు సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు.

News July 7, 2025

తెలంగాణ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జులు

image

* ఖమ్మం- వంశీచంద్ రెడ్డి, * మెదక్- పొన్నం ప్రభాకర్
* నల్గొండ- సంపత్ కుమార్
* వరంగల్- అడ్లూరి లక్ష్మణ్
* హైదరాబాద్- జగ్గారెడ్డి
* మహబూబ్‌నగర్- కుసుమకుమార్
* ఆదిలాబాద్- అనిల్‌ యాదవ్
* కరీంనగర్- అద్దంకి దయాకర్
* నిజామాబాద్- హుస్సేన్
* రంగారెడ్డి- శివసేనారెడ్డి

News July 7, 2025

కిలోకు రూ.12 చెల్లించి మామిడి కొనుగోళ్లు

image

AP: మద్దతు ధర లేక అల్లాడుతున్న తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రస్తుతం కేజీకి రూ.8 చెల్లిస్తుండగా, ప్రభుత్వం అదనంగా రూ.4 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిలో మామిడికి రూ.12 చెల్లిస్తున్నారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 3.08 మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్ల వారు కొనుగోలు చేశారు.