News November 18, 2024
Stock Market: బేర్స్ జోరు.. బుల్స్ బేజారు
స్టాక్ మార్కెట్లు మార్నింగ్ సెషన్‌లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మొదటి అరగంట పాటు బెంచ్ మార్క్ సూచీలు రిట్రేస్‌మెంట్ అవ్వకుండా నష్టాలవైపు పయనించాయి. అయితే సెన్సెక్స్ 77,000 పరిధిలో, నిఫ్టీ 23,350 పరిధిలో ఇప్పటికే రెండు సార్లు సపోర్టు తీసుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 459 పాయింట్ల నష్టంతో 77,127 వద్ద, నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో 23,401 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Similar News
News November 18, 2024
నెవర్ బిఫోర్.. T20ల్లో ఇండియా విన్నింగ్ స్ట్రైక్ రేట్ 92.31%
ఇటీవల సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా అరుదైన రికార్డును సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్(92.31 శాతం) నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ ఏడాది భారత్ 26 మ్యాచ్‌లకు గాను ఏకంగా 24 టీ20ల్లో గెలిచింది. 2018లో పాక్ 89.43%, 2023లో ఉగాండా 87.88%, 2019లో పపువా న్యూగినియా 87.5%, 2022లో టాంజానియా 80.77% విజయాలు నమోదు చేశాయి.
News November 18, 2024
BIG BREAKING: ఎందరు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే
AP: పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. జనాభా వృద్ధి రేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇకపై ఎందరు పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభిస్తుంది. మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందితే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.
News November 18, 2024
హరీశ్ రావు పక్కచూపులు చూస్తున్నారు: TPCC చీఫ్
TG: BRSలో ఎవరూ మిగలరని, హరీశ్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితలే ఆ పార్టీలో ఉంటారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జనవరి నుంచి కొంతమందికి పదవులు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.