News November 18, 2024
లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే లగచర్ల ఘటన: డీకే అరుణ

TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 16 మందితో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ ములాఖత్ అయ్యారు. ఫార్మా కంపెనీ కోసం రైతుల నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అరుణ దుయ్యబట్టారు. భూములు ఇవ్వడం ఇష్టం లేకనే ప్రజావేదికను లగచర్ల ప్రజలు బహిష్కరించారని చెప్పారు. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే లగచర్లలో దాడి జరిగిందని అన్నారు.
Similar News
News January 16, 2026
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుతో 8వేల మందికి ఉపాధి

AP: కాకినాడలో CM CBN ప్రారంభించనున్న AM గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ₹90వేల CRతో ఏర్పాటయ్యే ఇది దేశంలో మొదటిది. 8వేల మందికి ఉపాధి కల్పించనుంది. దశలవారీగా 2030కి 1.5 MT గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది. విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ షిప్పింగ్ ఫ్యూయల్‌కు ఇది ఉపకరిస్తుంది. ఇక్కడి నుంచి గ్రీన్ ఎనర్జీ మాలిక్యూల్స్‌ను జర్మనీ, జపాన్, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారు.
News January 16, 2026
గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడి గెలుపు

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్ MH ‘జల్నా’ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2,621 ఓట్ల మెజారిటీతో గెలిచారు. BJP సహా ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించారు. ఏక్‌నాథ్ షిండే శివసేన ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. 2018లో అరెస్టై, 2024 సెప్టెంబర్‌లో కర్ణాటక హైకోర్టు నుంచి పంగర్కర్ బెయిల్ పొందారు. గతంలో అవిభక్త శివసేనలో కార్పొరేటర్‌గా పనిచేశారు.
News January 16, 2026
AIIMS రాయ్‌పూర్‌లో ఉద్యోగాలు

AIIMS రాయ్‌పూర్ 40 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 19న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. MBBS ఉత్తీర్ణతతో పాటు DMC/NMC/స్టేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in


