News November 18, 2024
అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: నారా రోహిత్
తన తండ్రి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వేళ అండగా నిలిచిన అందరికీ హీరో నారా రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ముఖ్యంగా ఈ కష్టకాలంలో మాలో ధైర్యాన్ని నింపిన పెదనాన్న(చంద్రబాబు), పెద్దమ్మ(భువనేశ్వరి), లోకేశ్ అన్నయ్య, బ్రాహ్మణి వదినకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అని చెప్పారు. కాగా రోహిత్ తండ్రి, సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2024
అరెస్టులకు భయపడేవారు లేరిక్కడ: KTR
TG: రాష్ట్రంలో ప్రశ్నిస్తే సంకెళ్లు, నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై KTR మండిపడ్డారు. ‘నియంత రాజ్యమిది, నిజాం రాజ్యాంగమిది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేశారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావు. నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ’ అని KTR ట్వీట్ చేశారు.
News November 18, 2024
DSC నోటిఫికేషన్ మరింత ఆలస్యం?
AP: షెడ్యూల్ ప్రకారం DSC నోటిఫికేషన్ ఈనెల 6న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, 2, 3 నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 18, 2024
TTD పాలకమండలి మరిన్ని నిర్ణయాలు
* TTD ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం
* 2,3గంటల్లో సర్వదర్శనం అయ్యేలా చర్యలు
* తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు
* తిరుపతి ఫ్లై ఓవర్‌కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ
* TTDలోని అన్యమత ఉద్యోగులకు VRS, లేదంటే బదిలీ
* తిరుపతి వాసులకు ప్రతినెలా తొలి మంగళవారం దర్శనం
* అన్నప్రసాదంలో కొత్త పదార్థాలు
* ప్రైవేట్ బ్యాంకుల్లోని TTD నగదు ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ
* ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు