News November 18, 2024

ఆ స్టాక్‌లో 20% ప‌త‌నం

image

Mamaearth పేరెంట్ కంపెనీ Honasa Consumer షేరు ధ‌ర సోమ‌వారం 20% వ‌ర‌కు ప‌త‌న‌మైంది. Q2 ఫ‌లితాలు ఆశించిన దాని కంటే బ‌ల‌హీనంగా ఉండ‌డంతో ఇన్వెస్ట‌ర్లు అమ్మ‌కాల‌కు దిగారు. దీంతో స్టాకు ధ‌ర లోయ‌ర్ స‌ర్క్యూట్‌ను తాకి రూ.297 వ‌ద్ద ట్ర‌ేడ్ అవుతోంది. కొన్ని ఏజెన్సీలు సంస్థ‌కు డౌన్‌గ్రేడ్ రేటింగ్‌ ఇచ్చాయి. Emkay Global ఏజెన్సీ Sell రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్‌ను ₹600 నుంచి ₹300కు త‌గ్గించింది.

Similar News

News November 18, 2024

దూరదృష్టితో కులగణన చేపట్టాం: పొంగులేటి

image

TG: గత ప్రభుత్వం సమగ్ర సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. KCR ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతున్నట్లు చెప్పారు. మంచి ప్రతిపక్షంగా విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. దూరదృష్టితో తమ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందని తెలిపారు. తాము ఏ పనినీ కక్షపూరితంగా చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నేతలు చేసిన అక్రమాలపై చట్టపరంగానే చర్యలుంటాయని వెల్లడించారు.

News November 18, 2024

RECORD: ఒకే రోజు 5 లక్షల మంది విమాన ప్రయాణం

image

దేశీయ విమాన రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. నవంబర్ 17న 3,173 విమానాల్లో 5,05,412 మంది ప్రయాణం చేశారు. ఒక రోజులో ఇంత మంది ప్రయాణించడం ఇదే తొలిసారి. అన్ని విమానాల్లో 90 శాతంపైన ఆక్యుపెన్సీ నమోదవగా, పలు కారణాలతో సర్వీసులన్నీ ఆలస్యంగానే నడిచాయి. ఫెస్టివల్, పెళ్లిళ్ల సీజన్ కారణంగానే ఈ ట్రాఫిక్ నమోదైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే డిమాండ్ వింటర్ అంతా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.

News November 18, 2024

పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ఫిర్యాదు

image

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ‘X’లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ పవన్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. HYDలో 2దశాబ్దాలుగా మతపరమైన గొడవలు జరగలేదని, పవన్‌ తాజా వ్యాఖ్యలు అవమానకరమని రాసుకొచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమాధానమిచ్చారు.