News November 18, 2024
విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు

విశాఖలో సోమవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయసంక్షేమ శాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ హరీంద్రప్రసాద్ పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు, సంస్కరణలు, చేపట్టబోయే ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News July 9, 2025
‘అప్పుఘర్ వద్ద సిద్ధంగా గజఈతగాళ్ళు’

అప్పుఘర్ వద్ద గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నేడు జరగనున్న గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్లు అజిత జువేరి, లక్ష్మీనారాయణ పరిశీలించారు. అప్పుఘర్‌లో గిరిప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీలు ఏసీపీ నర్సింహామూర్తికి పలు సూచనలు చేశారు. విద్యుత్ వెలుగులతో పాటు బందోబస్తు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ.. 200 ప్రత్యేక బస్సులు

ఈనెల 9న విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణకు సింహాచలం కొండకింద నుంచి పైకి వెళ్లేందుకు, మరల పైనుంచి కిందకి వచ్చేందుకు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. సింహాచలం నుంచి నగరంలోకి వచ్చేందుకు 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జులై 9, 10వ తేదీల్లో సిబ్బందికి విధించిన డ్యూటీల మేరకు హాజరవ్వాలన్నారు.
News July 8, 2025
ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు

ఎంవీపీ కాలనీ ఒకటో సెక్టార్‌లో ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు ఏర్పాటు చేశారు. స్థానికంగా కొందరు మిత్రులు కలసి గిరిప్రదక్షిణ భక్తుల కోసం దీనిని నిర్మించారు. ఇందులో వేంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రసాద వితరణతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.