News November 18, 2024

సీఎం ఏక్‌నాథ్ శిండే కీలక ప్రకటన

image

మ‌హారాష్ట్ర సీఎం ప‌ద‌వి రేసులో తాను లేన‌ని ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిండే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హాయుతి కూట‌మిలో సీఎం ప‌ద‌వికి ఎలాంటి రేస్ లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావ‌డ‌మే త‌మ ల‌క్ష్యమ‌న్నారు. మ‌హాయుతి కూట‌మి విజ‌యం సాధిస్తే బీజేపీ నేతకే సీఎం పదవి దక్కే అవకాశం ఉన్నట్టు శిండే వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్ట‌మైంది. అజిత్ ప‌వార్‌కు మరోసారి నిరాశ తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Similar News

News November 18, 2024

పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ఫిర్యాదు

image

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ‘X’లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ పవన్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. HYDలో 2దశాబ్దాలుగా మతపరమైన గొడవలు జరగలేదని, పవన్‌ తాజా వ్యాఖ్యలు అవమానకరమని రాసుకొచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమాధానమిచ్చారు.

News November 18, 2024

GREAT: కంటిచూపు లేకపోయినా గ్రూప్-4 జాబ్

image

ఖమ్మం జిల్లా కారేపల్లి(M) చీమలవారిగూడెంకు చెందిన మానస అంధురాలు. టెన్త్ వరకు గ్రామంలో, అనంతరం ఫ్రెండ్స్ సాయంతో కారేపల్లికి 4KM నడిచి వెళ్లి ఇంటర్, డిగ్రీ చదివారు. ఇంటి వద్దే ప్రిపేరై 2022లో బ్యాంక్ జాబ్ సాధించిన మానస.. సహాయకురాలి చేయూతతో గ్రూప్-4 పరీక్ష రాశారు. తన కృషికి ఫలితాల్లో జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తపన ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని మానస నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

News November 18, 2024

అది మంచి పద్ధతి కాదు: RBI గవర్నర్ వార్నింగ్

image

బ్యాంకులు తప్పుడు లేదా అరకొర సమాచారంతో కస్టమర్లకు ప్రొడక్ట్స్ విక్రయించడంపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ విధానంతో షార్ట్ టర్మ్‌లో లాభపడినా లాంగ్‌టర్మ్‌లో నష్టపోతారని హెచ్చరించారు. KYC వెరిఫికేషన్ కాకుండా అకౌంట్లు తెరవడం, మిస్ సెల్లింగ్ వంటి అనైతిక పద్ధతులను అడ్డుకోవాలన్నారు. వీటికి తావులేకుండా స్టాఫ్ ఇన్సెంటివ్స్‌ను రూపొందించాలని సూచించారు.