News November 18, 2024
రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవంటూ హైకోర్టులో పిటిషన్
TG: రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవని, గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై CJ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజలు రోడ్డు సమస్యలు తెలిపేలా మొబైల్ యాప్ రూపొందించి R&B, HMDA అధికారులు దాన్ని నిర్వహించాలని గతంలో ఆదేశించినట్లు హైకోర్టు అధికారులకు గుర్తు చేసింది. మరో నెలలో యాప్ అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. ఆపై విచారణను హైకోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది.
Similar News
News November 18, 2024
ఈనెల 21న ‘తండేల్’ నుంచి ‘బుజ్జి తల్లి’ సాంగ్
అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ‘తండేల్’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సాంగ్‌ను ఈనెల 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News November 18, 2024
మణిపుర్ మంటలు: మరోసారి అమిత్ షా హైలెవల్ మీటింగ్
మణిపుర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హై లెవల్ మీటింగ్ నిర్వహించారని తెలిసింది. ఆదివారం సైతం ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి ఆయన సమీక్షించడం గమనార్హం. మైతేయ్ ప్రజలపై కుకీ మిలిటెంట్లు దాడులు చేయడంతో రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. దీంతో కేంద్రం అదనంగా 50 కంపెనీల సాయుధ బలగాలను అక్కడికి తరలించింది. ఇప్పటికే మోహరించిన వాటితో కలిపి ఈ సంఖ్య 70కి చేరింది.
News November 18, 2024
లగచర్ల ఘటనలో DSPపై బదిలీ వేటు
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో DSPపై వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిగి కొత్త DSPగా శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు నియమించారు. ఈ ఘటనలో ఇవాళ దౌల్తాబాద్ మండలం సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.