News November 18, 2024
గాలి కాలుష్యంతో ఏటా 20 లక్షల మంది మృతి!

దేశంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణాంతక వ్యాధులతో ఏటా లక్షల మంది చనిపోతున్నారని ఆందోళన చెందుతుంటాం. అయితే, నాణ్యమైన గాలిని పీల్చుకోలేకపోవడం వల్ల కూడా ఏటా ఇండియాలో దాదాపు 20 లక్షల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం మీకు తెలుసా? కలుషితమైన గాలిని పీల్చి శ్వాసకోశ వ్యాధులు, ఇతర రోగాలతో బాధపడుతూ నిత్యం 5400 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వం ఈ మహమ్మారిపై దృష్టిసారించాలని నెటిజన్లు కోరుతున్నారు.
Similar News
News January 13, 2026
కడప జిల్లాలో పోస్టింగ్.. భర్త SP.. భార్య JC.!

కడప JCగా నూతనంగా నిధి మీనా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం కడప జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న షెల్కే నచికేత్ విశ్వనాథ్ సతీమణి. ఈమెది 2019 ఐఏఎస్ బ్యాచ్. మొదటగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వయోజన విద్య డైరెక్టర్‌గా, ఎన్టీఆర్ JCగా విధులు నిర్వహించారు. ఇప్పటివరకు కడప JCగా పనిచేసిన అదితిసింగ్ ప్రసూతి సెలవులో ఉన్నారు.
News January 13, 2026
తెలంగాణలో ‘కొత్త’ పంచాయితీ!

రాష్ట్రంలో జిల్లాలు మరోసారి మారే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016లో నాటి CM KCR జిల్లాలను విభజించారు. కానీ అది శాస్త్రీయంగా జరగలేదని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని ప్రస్తుత CM రేవంత్ ఆరోపించారు. వాటిని సరిచేసేందుకు కమిటీ వేస్తామన్నారు. అయితే ప్రజలకు పాలన దగ్గర చేయాలనే కొత్త జిల్లాలు తెచ్చామని, వాటిని ముట్టుకుంటే అగ్గి రాజేస్తామన్న KTR మాటలతో రాజకీయ దుమారం మొదలైంది.
News January 13, 2026
గర్భిణులు నువ్వులు తినకూడదా?

పండుగ పిండివంటల్లో ఎక్కువగా నువ్వులను వాడుతుంటారు. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్, విటమిన్లు అనేక అనారోగ్యాలకు చెక్ పెడతాయి. అయితే గర్భిణులు మాత్రం నువ్వులు తినకూడదని చాలామంది చెబుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే గర్భిణులు నువ్వులు తినడం వల్ల గర్భాధారణ సమయంలో తల్లికి అవసరం అయ్యే పోషకాలు, క్యాల్షియం, విటమిన్స్, అమినోయాసిడ్స్, ప్రోటీన్స్, ఐరన్ పుష్కలంగా అందుతాయి. కానీ చాలా మితంగా తీసుకోవాలి.


