News November 18, 2024

3Hrs నిలబెట్టి 15 మంది ర్యాగింగ్.. విద్యార్థి మృతి

image

గుజరాత్‌లోని ధార్పూర్ GMERS మెడికల్ కాలేజీ హాస్టల్లో దారుణం జరిగింది. థర్డ్ ఇయర్ సీనియర్స్ 15 మంది ఇంట్రో పేరుతో ఫస్ట్ఇయర్ స్టూడెంట్‌ అనిల్ మెథానియాను ర్యాగింగ్ చేశారు. ఏకధాటిగా 3 గంటలు నిలబెట్టారు. దీంతో ఆ విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. 3 గంటలు నిలబెట్టిన విషయాన్ని పోలీసులు రికార్డు చేసుకున్న కాసేపటికే అతడు మరణించడం సంచలనంగా మారింది. పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News November 18, 2024

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* RRR(రీజనల్ రింగ్ రోడ్) ప్రాజెక్టు డైరెక్టర్‌గా IAS హరిచందన నియామకం
* RRR దక్షిణ భాగం ప్రాజెక్ట్ కన్సల్టెంట్ నియామకానికి గవర్నమెంట్ అనుమతి
* రూ.4,170 కోట్లతో వరంగల్ భూగర్భ డ్రైనేజీ నిర్మాణం
* HYDను మించి వరంగల్‌ అభివృద్ధి: కొండా సురేఖ
* లగచర్ల వెళ్తున్న ఈటల, డీకే అరుణను అడ్డగించిన పోలీసులు
* TGలో భూసేకరణ పేరుతో దౌర్జన్యం: ఢిల్లీలో BRS MP సురేశ్ రెడ్డి
* BRS, BJP రెండూ ఒకటే: మహేశ్ గౌడ్

News November 18, 2024

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడి అరెస్ట్

image

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌‌ను అమెరికాలో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ముంబైలో పొలిటికల్ పార్టీ యాక్టివిటీస్‌లో అతడు జోక్యం చేసుకుంటున్నట్టు NIA ఈమధ్యే గమనించింది. అతడి సమాచారమిస్తే రూ.10 లక్షల బౌంటీ ఇస్తామని ప్రకటించింది. యాక్టర్ సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.

News November 18, 2024

రోహిత్ నిర్ణయాన్ని 100 శాతం సపోర్ట్ చేస్తా: ట్రావిస్ హెడ్

image

రెండోసారి తండ్రయిన రోహిత్ శర్మ భార్య, బిడ్డలతో గడపడానికి BGT తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ నిర్ణయాన్ని తాను 100 శాతం సపోర్ట్ చేస్తానని ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ వెల్లడించారు. ఆ పరిస్థితుల్లో తాను ఉన్నా అదే పనిచేస్తానన్నారు. ‘క్రికెటర్లుగా మేం ఎన్నో త్యాగాలు చేస్తాం. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలకు దూరమవుతాం. ఆ సమయం మళ్లీ తిరిగిరాదు’ అని పేర్కొన్నారు.