News November 18, 2024

పాక్ ODI టీమ్ హెడ్‌కోచ్‌గా అకీబ్

image

పాకిస్థాన్ వన్డే జట్టుకు నెలలోనే మూడో హెడ్ కోచ్ వచ్చారు. ఆ స్థానంలో మాజీ ఆల్‌రౌండర్ అకీబ్ జావేద్‌ను నియమించినట్లు PCB ప్రకటించింది. మేనేజ్‌మెంట్, ఆటగాళ్లతో విభేదాలతో గత నెల 28న ODI జట్టు కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తాత్కాలిక కోచ్‌గా గిలెస్పీని ఎంపిక చేసింది. ఇప్పుడు ఆయననూ తప్పించి అకీబ్‌కు ఛాన్స్ ఇచ్చింది. ఈయన పాక్ తరఫున 163 ODIలు, 22 టెస్టులు ఆడారు.

Similar News

News January 15, 2026

WPL: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

image

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ (36) శుభారంభం ఇవ్వగా, లిజెల్లీ లీ (67) చెలరేగి ఆడి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ, ఈ గెలుపుతో టోర్నీలో తన ఖాతాను తెరిచింది.

News January 15, 2026

మున్సిపల్ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు

image

TG: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో జనరల్ 30, జనరల్ మహిళ 31, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19, ఎస్సీ జనరల్ 9, SC మహిళ 8, ఎస్టీ జనరల్ 3, ST మహిళలకు 2 స్థానాలు కేటాయించింది. 10 కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళ 4, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, ఎస్సీ 1, ఎస్టీకి ఒక స్థానంలో కేటాయింపులు చేసింది. ఈ నెల 17లోపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది.

News January 15, 2026

భారత్ ఓటమి.. వీటికి సమాధానమేది?

image

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమ్ ఇండియా ఓటమితో పలు ప్రశ్నలు వస్తున్నాయి. ‘ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జడేజా తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఎంత వరకు కరెక్ట్? బుమ్రాకు రెస్ట్ ఉన్న సమయంలో స్టార్ బౌలర్‌గా పేరున్న అర్షదీప్ సింగ్‌ను బెంచ్ పరిమితం చేయడమేంటి? పదే పదే జడేజాను నమ్ముకోకుండా ప్రత్నామ్నాయంపై దృష్టి పెట్టాలి’ అని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. మీరేమంటారు?