News November 18, 2024
DSC నోటిఫికేషన్ మరింత ఆలస్యం?
AP: షెడ్యూల్ ప్రకారం DSC నోటిఫికేషన్ ఈనెల 6న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, 2, 3 నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 18, 2024
ALERT: ఈ రైళ్ల నంబర్లు మారుతున్నాయ్
వచ్చే ఏడాది మార్చి నుంచి పలు రైళ్ల నంబర్లను మార్చనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటిలో విశాఖ-కడప, విశాఖ-గుంటూరు, భువనేశ్వర్-రామేశ్వరం, భువనేశ్వర్-పుదుచ్చేరి, భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ రైళ్లు ఉన్నాయి. నంబర్లను మార్చడానికి గల కారణాలను SCR వెల్లడించలేదు. ఏ తేదీ నుంచి ఏ ట్రైన్ నంబర్ మారుతుందో పైన ఫొటోలో చూడొచ్చు.
News November 18, 2024
దారుణం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, బాలిక హత్య!
HYDలోని మియాపూర్ అంజయ్య నగర్‌కు చెందిన బాలిక (17) ఈ నెల 8న అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు బాలిక డెడ్‌బాడీని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసరాల్లో గుర్తించారు. బాలికకు ఇన్‌స్టాలో పరిచయమైన ఉప్పుగూడ యువకుడే హత్యకు కారణమై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News November 18, 2024
గ్రూప్-3: సగం మంది పరీక్షలు రాయలేదు!
TG: గ్రూప్-3 పరీక్షలు నేటితో ముగిశాయి. మూడు పేపర్లకు కలిపి 50% మందే హాజరయ్యారు. నిన్న నిర్వహించిన పేపర్-1కు 51.1%, పేపర్-2కు 50.7%, నేడు నిర్వహించిన పేపర్-3కి 50.24% హాజరైనట్లు TGPSC తెలిపింది. ఈ గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారా 1363 పోస్టులను భర్తీ చేయనున్నారు.