News November 18, 2024

గుడ్‌న్యూస్: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీని విద్యాశాఖ మరోసారి <>పొడిగించింది.<<>> ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 వరకు చెల్లించవచ్చు. రూ.50 ఫైన్‌తో DEC 2 వరకు, రూ.200 జరిమానాతో DEC 9 వరకు, రూ.500 అదనపు రుసుముతో DEC 16 వరకు అవకాశం ఉంది. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టుల లోపు రూ.110, ఒకేషనల్ స్టూడెంట్స్ రూ.60 అదనంగా చెల్లించాలి.

Similar News

News November 18, 2024

స్కూటీపై 8 మంది.. ప్రాణాలతో చెలగాటం

image

AP: గుంటూరు (D) మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద ఓ స్కూటీపై 8 మంది ప్రయాణిస్తూ కెమెరాకు చిక్కారు. ముందు వైపు ముగ్గురు, వెనక నలుగురితో ప్రయాణించాడు. ఇది ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని, ఆ వ్యక్తికి కామన్ సెన్స్ ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎక్కువగా చిన్న పిల్లలే ఉన్నారని, హెల్మెట్ కూడా లేదని ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటని నిలదీస్తున్నారు. ఇతనికి ఎంత ఫైన్ వేయాలి? అని మండిపడుతున్నారు.

News November 18, 2024

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. అంతా క్షేమం

image

TG: గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో జయశ్రీ అనే మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఓ ఆడ, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా ఇటీవల ఏపీలోని కాకినాడ జీజీహెచ్‌లోనూ తపస్విని అనే మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో ఇద్దరు ఆడ, ఓ మగ శిశువులు ఉన్నారు.

News November 18, 2024

‘బరి తెగించిపోతున్నాడు’ అంటే?

image

ఎవరైనా హద్దుమీరి మాట్లాడినా, చెప్పిన మాటలను లెక్కచేయకున్నా.. బరితెగించి పోతున్నాడు అంటాం. అసలు బరి అంటే ఏంటో తెలుసా? కుస్తీలో పోరాడవలసిన స్థల పరిమితులను బరి అని పిలుస్తుంటారు. దానిని దాటిన వ్యక్తి బరితెగించి పోతున్నాడు అంటారు. సమాజంలో ఉన్నప్పుడు కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అలాంటి వ్యక్తులను బరితెగించి పోతున్నాడు అని అంటుంటారు.