News November 18, 2024

మరో 500 SBI బ్రాంచీలు: నిర్మల

image

FY25 చివరికి మరో 500 SBI బ్రాంచీలను ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఆ సంఖ్య 23,000లకు చేరుకుంటుందని తెలిపారు. దేశంలో SBIకి 50crకు పైగా కస్టమర్లు ఉన్నారని, మొత్తం డిపాజిట్లలో 22.4% వాటా ఉందని చెప్పారు. రోజుకు 20cr UPI లావాదేవీలను నిర్వహిస్తోందన్నారు. ముంబైలోని SBI ప్రధాన కార్యాలయం వందో వార్షికోత్సవం సందర్భంగా రూ.100 స్మారక నాణెంను ఆమె ఆవిష్కరించారు.

Similar News

News November 18, 2024

USలో చైనాను బీట్ చేసిన ఇండియన్ స్టూడెంట్స్

image

అమెరికాకు 2009 తర్వాత అత్యధికంగా విద్యార్థుల్ని పంపిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. 2023-24లో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయులు US ఉన్నత విద్యాలయాల్లో ఎన్‌రోల్ అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 23% ఎక్కువ. గ్రాడ్యుయేట్స్ 1,96,567 (19%), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ 97,556 (41%)గా ఉన్నారు. చైనీయులు 4% తగ్గి 2,77,398కి చేరుకున్నారు.

News November 18, 2024

రేపు వరంగల్‌కు సీఎం రేవంత్.. షెడ్యూల్ ఇదే!

image

TG: CM రేవంత్ రెడ్డి మంగళవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2.30కు వరంగల్ చేరుకొని, రోడ్డు మార్గాన ఆర్ట్స్ కాలేజీకి వెళ్తారు. 3.20-3.50వరకు ఇందిరా మహిళా స్టాల్స్ సందర్శిస్తారు. అనంతరం కాలేజీ గ్రౌండ్‌లోని వేదికపైకి చేరుకొని 22జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఆపై ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లను ప్రారంభించి, 4.40 తర్వాత CM ప్రసంగిస్తారు.

News November 18, 2024

బైడెన్‌ను కలిసిన మోదీ

image

బ్రెజిల్ రాజధాని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిశారు. ఈ ఫొటోను మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైడెన్‌ను కలిసిన ప్రతిసారి ఆనందంగా ఉంటుందని చెప్పారు. వారిద్దరూ కాసేపు ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. కాగా మోదీ నవంబర్ 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించనున్నారు.