News November 18, 2024
వామ్మో.. రోజూ 40 సిగరెట్ల కాలుష్యాన్ని పీలుస్తున్నారు
ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం కలవరపెడుతోంది. అక్కడ ఒక్కో వ్యక్తి రోజూ సగటున 40 సిగరెట్లు తాగినంత పొల్యూషన్‌ను పీలుస్తున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆ తర్వాత హరియాణా(29), బిహార్(10), UP(9.5), రాజస్థాన్, బెంగాల్, ఒడిశా(7.5), MP(5.5) ఉన్నాయి. లద్దాక్, లక్షద్వీప్ 0, ఈశాన్య రాష్ట్రాలు, J&K, కర్ణాటక, హిమాచల్, కేరళ 0.5-1, AP, TG ప్రజలు రెండు సిగరెట్ల కాలుష్యాన్ని పీలుస్తున్నారు.
Similar News
News December 27, 2024
వారం రోజులు సంతాప దినాలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆయనకు సంతాపం తెలపనుంది.
News December 27, 2024
తెలంగాణ వాసుల కోరిక నెరవేర్చిన మన్మోహన్
తెలంగాణ ప్రజల ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నెరవేర్చింది మన్మోహనే. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూల, అననుకూల నేతలతో ఎన్నో చర్చలు చేశారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలను ప్రస్తావించారు. విభజిత APకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తొలుత చెప్పింది ఈయనే. అయితే తర్వాత NDA పట్టించుకోలేదు.
News December 27, 2024
మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలివే(1/2)
1991 నాటికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ నిల్వలు అడుగంటిపోయాయి. అప్పులు పెరిగి రూపాయి విలువ తగ్గింది. ఆ సమయంలో ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ జట్టుకట్టారు. లిబరలైజేషన్(వ్యాపారాలకు నియంత్రణల తొలగింపు), గ్లోబలైజేషన్(విదేశీ పెట్టుబడుల కోసం మల్టీనేషనల్ కంపెనీలకు అనుమతి), ప్రైవేటీకరణ(ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రోత్సహించారు.