News November 18, 2024
ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీకి అర్హత.. కారణం ఇదే

AP: గత మూడు దశాబ్దాల్లో జనాభా నియంత్రణకు తీసుకున్న చర్యలతో సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది. 2001లో 2.6 నుంచి 1.5కు తగ్గిందని.. జనన, మరణాల నిష్పత్తిలో ఏపీ బాగా వెనుకబడిందని పేర్కొంది. ఇదే సమయంలో వృద్ధుల జనాభా రేటు ఎక్కువగా ఉందని తెలిపింది. అందుకే తాజాగా స్థానిక ఎన్నికల్లో <<14644385>>ఎంత మంది పిల్లలు<<>> ఉన్నా పోటీకి అర్హత కల్పిస్తున్నట్లు వివరించింది.
Similar News
News January 17, 2026
పిల్లల్లో RSV ఇన్ఫెక్షన్

రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌ని ‘బ్రాంకియోలైటిస్’ అంటారు. ఇది ఏడాదిలోపు పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. 3,4 రోజుల తర్వాత దీని లక్షణాల తీవ్రత పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరంతో ఖంగు ఖంగుమని ఏకధాటిగా దగ్గుతుంటారు. కొంతమంది పిల్లల్లో ఆయాసం వస్తుంది. ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. విపరీతమైన ఆయాసం ఉన్నా, ఫీడింగ్ సరిగా లేకపోయినా పిల్లల్ని హాస్పిటల్‌లో ఉంచే వైద్యం చేయాలి.
News January 17, 2026
RSV ఇన్ఫెక్షన్‌ను ఎలా నివారించాలంటే?

వర్షాకాలం, చలికాలంలో ఇన్‌ఫెక్షన్లు ప్రబలినప్పుడు గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. బిడ్డను తీసుకొని ఫంక్షన్లకు వెళ్లడం సరికాదు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లకు తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉండాలి. సరైన ఇమ్యూనిటీ లేని పిల్లలకు ఆర్‌ఎస్‌వీ ఇమ్యూనోగ్లోబ్యులిన్ వ్యాక్సిన్ ఇస్తారు. పిల్లల్లో లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. పిల్లలకు పోషకాహారం ఎక్కువగా ఇవ్వాలి.
News January 17, 2026
సావిత్రి గౌరీ నోము ఎలా ఆచరించాలి?

మట్టితో చేసిన దేవతా మూర్తుల బొమ్మలను ఓ పీఠంపై ఉంచి, వాటి మధ్యలో పసుపుతో చేసిన గౌరీదేవిని పూజించాలి. నూతన వధువులు ఈ వ్రతాన్ని వరుసగా 9 రోజుల పాటు భక్తితో ఆచరిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. రోజూ అమ్మవారికి 9 రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి పండ్లు, తాంబూలం వాయనంగా ఇవ్వాలి. తొమ్మిదో రోజు పూజ పూర్తయ్యాక, ఆ మట్టి బొమ్మలను పుణ్యతీర్థాలలో నిమజ్జనం చేయాలి.


