News November 18, 2024

శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఇక జనరల్ ఖాతాకు

image

టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ను గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దళారులు లేకుండా స్వామి వారి దర్శనంతో పాటు ఆలయాల పున: నిర్మాణం, జీర్ణోద్ధరణ చేయాలని ఏర్పాటు చేశారు. నిధులు దుర్వినియోగం అయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నూతన బోర్డు ఆ పేరు మార్చడంతో పాటు నిధులను జనరల్ ఖాతాకు జమ చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంపై మరింత స్పష్టత టీటీడీ ఇవ్వాల్సి ఉంది.

Similar News

News November 18, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి

image

ట్రాక్టర్ ఢీకొని కర్ణాటకకు చెందిన స్కూటరిస్టు దుర్మరణం చెందినట్లు పీటీఎం ఎస్ఐ నరసింహుడు తెలిపారు. పీటీఎం మండలం, మల్లెలగ్రామం చెన్నరాయునిపల్లి వద్ద గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం, చిలక నేర్పు గ్రామానికి చెంది రైతు రామాంజి(48) అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే కర్ణాటకకు తరలించారు.

News November 18, 2024

పోలీసులపై ప్రివిలేజ్ మోషన్: తిరుపతి MP

image

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్తే కనీసం తీసుకోవడానికి కూడా వారు ఆసక్తి చూపలేదని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై జుగుప్సాకర పోస్టులను పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా తదితరులతో కలిసి ఆయన ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 40 నిమిషాల పాటు తమను పట్టించుకోలేదని, వారిపై ప్రివిలైజేషన్ మూవ్ చేస్తామని హెచ్చరించారు.

News November 18, 2024

తిరుమలలో అన్యమత ప్రచారం.. ఇద్దరిపై కేసు

image

పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థాన పాపవినాశనం ఆవరణంలో అన్యమత ప్రచారానికి పాల్పడ్డ ఇద్దరు మహిళలపై తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాపవినాశనం వద్ద శంకరమ్మ, మీనాక్షి భక్తుల ముందే ఆదివారం ఓ మతానికి సంబంధించి పాటలకు రీల్స్ చేయడం పెను దుమారం రేపింది. దీంతో భక్తుల ఫిర్యాదు మేరకు టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.