News November 18, 2024
ADB: రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన అనిత (42) స్థానిక తాంసి రైల్వే గేట్ వద్ద వెళ్తుండగా గుర్తు తెలియని టిప్పర్ లారీ ఆమె కాళ్ల పై నుంచి వెళ్లింది. దీంతో ఆమె ఒక కాలు నుజ్జు నుజ్జు అయి తీవ్ర గాయాల పాలయింది. గమనించిన స్థానికులు అంబులెన్స్లో ఆమెను రిమ్స్‌కు తరలించారు.
Similar News
News April 17, 2026
ఆదిలాబాద్: మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ షురూ

ఆదిలాబాద్ మున్సిపాలిటిలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నలుగురు సభ్యులను ఎన్నుకునేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో ఇద్దరు మైనారిటీలు, ఇద్దరు ఇప్పటికే కౌన్సిలర్లుగా పని చేసిన వారిని ఎన్నుకొనగా.. రెండు విభాగాల్లో ఒక మహిళ సభ్యురాలు ఉండనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 25లోపు పూర్తి వివరాలను సమర్పించాలని కమిషనర్ రాజు తెలిపారు.
News April 17, 2026
ఆదిలాబాద్: DOST HELP LINE సెంటర్

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత తెలిపారు. ఈ నెల 15న మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. ఆధార్, ఫోన్, ధ్రువపత్రాలతో రావాలన్నారు.
News April 17, 2026
ఆదిలాబాద్: POLYCETకు దరఖాస్తు చేసుకోండి

పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం మే 13న నిర్వహించే ‘పాలీసెట్’ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నరేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన, ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 20లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలో వచ్చే ర్యాంకు ఆధారంగానే డిప్లొమా కోర్సుల్లో సీట్లు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు.
SHARE IT


