News November 18, 2024
పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ఫిర్యాదు

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ‘X’లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ పవన్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. HYDలో 2దశాబ్దాలుగా మతపరమైన గొడవలు జరగలేదని, పవన్ తాజా వ్యాఖ్యలు అవమానకరమని రాసుకొచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమాధానమిచ్చారు.
Similar News
News November 15, 2025
దేశమంతా గర్వంగా ఫీలవుతుంది: మహేశ్ బాబు

వారణాసి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేశ్ బాబు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అందరూ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా రాజమౌళిని. ఇది విడుదలైన తరవాత దేశమంతా గర్వంగా ఫీలవుతుంది’ అని అన్నారు. ‘పౌరాణికం చేయమని నాన్న అడుగుతుండేవారు. ఆయన మాటలు ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఆయన నా మాటలు వింటుంటారు’ అని గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో మాట్లాడారు.
News November 15, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 5

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (జ.నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (జ.వాన)
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? (జ.సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (జ.దయ)
28. కీర్తికి ఆశ్రయమేది? (జ.దానం)
29. దేవలోకానికి దారి ఏది? (జ.సత్యం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 15, 2025
రామాయణంలోని ముఖ్య ఘట్టంతో ‘వారణాసి’: రాజమౌళి

మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి SS రాజమౌళి కీలక విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అస్సలు అనుకోలేదు. కానీ ఒక్కొక్క డైలాగ్, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదు, గాల్లో ఉన్నానని అనిపించింది’ అని అన్నారు. మహేశ్‌కు రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్‌బంప్స్ వచ్చాయని తెలిపారు.


