News November 18, 2024
తాను చనిపోయినా.. నలుగురికి ప్రాణం పోసిన రెండేళ్ల బాలుడు

కెన్యాకు చెందిన రెండేళ్ల లుండా యుంబా చనిపోతూ భారత్‌లోని నలుగురికి ప్రాణం పోశారు. రెండో అంతస్తు నుంచి పడిపోవడంతో లుండా తలకు గాయం అయింది. చికిత్స పొందుతూ అక్టోబర్ 26న బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందారు. దీంతో అతని అవయవాలు దానం చేసేందుకు లుండా తల్లి ముందుకొచ్చారు. ఇండియాలో పాంక్రియాస్ గ్రంథి దానం చేసిన అత్యంత పిన్న వయస్కుడు లుండానే. చండీగఢ్‌లోని PGI ఆస్పత్రి వైద్యులు లుండాకు ఘన నివాళులర్పించారు.
Similar News
News April 17, 2026
రాష్ట్రంలో కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు

TG: రాష్ట్రంలో కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ద్వారా అదనంగా 416 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లు ఉండగా, వాటిలో 15,600 మంది పేషంట్లు సేవలు పొందుతున్నారు. మరోవైపు 67 పాత సెంటర్లలో వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు కొత్తగా 155 మెషీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News April 17, 2026
5 మ్యాచుల్లో 0 వికెట్లు.. బుమ్రా పేలవ ప్రదర్శన

MI స్టార్ బౌలర్ బుమ్రా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తన పదునైన బౌలింగ్‌తో T20 WC గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈ యార్కర్ల కింగ్ IPLలో మాత్రం తేలిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. పైగా పరుగులు భారీగా సమర్పించుకుంటున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై 195 పరుగులు చేసినా ఓడిపోయింది. పరోక్షంగా ఇందుకు బుమ్రా కూడా కారణం. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చారు.