News November 18, 2024
DEC 21న జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్
రాజస్థాన్ జైసల్మేర్ వేదికగా DEC 21న GST కౌన్సిల్ 55వ సమావేశం జరగనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ భేటీకి అన్ని రాష్ట్రాలు/UTల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, లైఫ్ ఇన్సూరెన్స్‌పై GST మినహాయింపుపై(ప్రస్తుతం 18%) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 20 లీటర్ల డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్లు, నోట్‌బుక్స్‌పై GSTని 5 శాతానికి తగ్గించడంపై చర్చిస్తారు.
Similar News
News November 19, 2024
KCR 10 ఏళ్ల పాలన అద్భుతం: హరీశ్ రావు
TG: KCR అంటే చరిత్ర అని, పదేళ్లు అద్భుతంగా పాలించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పల్లెలతో పాటు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని, దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. కేసీఆర్ కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని వివరించారు. కేశవ చంద్ర రమావత్ (KCR) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరయ్యారు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానుంది.
News November 19, 2024
హైరింగ్ ప్రాసెస్‌లో ఏజ్, జెండర్, పెళ్లి వివరాలు అడగొద్దు: ఫాక్స్‌కాన్
ఉద్యోగ నియామక ప్రకటనల్లో ఏజ్, జెండర్, మారిటల్ స్టేటస్, కంపెనీ పేరు తొలగించాలని రిక్రూటింగ్ ఏజెంట్లను ఫాక్స్‌కాన్ ఆదేశించినట్టు తెలిసింది. యాంటీ డిస్క్రిమినేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. AC వర్క్‌ప్లేస్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, క్యాంటీన్, ఫ్రీ హాస్టల్ వంటివి పెట్టాలని చెప్పింది. శ్రీపెరంబదూర్లోని ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లో ఉద్యోగుల ఎంపిక కోసం థర్డ్‌పార్టీ ఏజెన్సీలను కంపెనీ నియమించుకుంది.
News November 18, 2024
ఢిల్లీలో 12వ తరగతి వరకు ప్రత్యక్ష క్లాసులు బంద్
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత పెరగడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 12వ తరగతులకు ఫిజికల్ క్లాసెస్ నిలిపివేస్తున్నామని, ఇక నుంచి ఆన్లైన్ క్లాసులు ఉంటాయని సీఎం అతిశీ వెల్లడించారు. ఇప్పటికే 9వ తరగతి వరకు క్లాసులను నిలిపివేశారు. గత 24 గంటల్లో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 493గా రికార్డయింది. ఈ సీజన్లో ఇదే అత్యల్ప గాలి నాణ్యత అని అధికారులు చెప్పారు.