News November 18, 2024

బుల్డోజర్ సిద్ధంగా ఉంది: యోగి

image

‘బుల్డోజర్ న్యాయం’ సరికాదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని రోజులకే UP CM యోగి మళ్లీ అలాంటి కామెంట్స్ చేశారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘సోరెన్ ప్రభుత్వం కేంద్ర నిధులను కొల్లగొట్టింది. వాటిని రికవరీ చేయడానికి బుల్డోజర్ సిద్ధంగా ఉంది. బంగ్లా వలసదారులు, రోహింగ్యాల చొరబాట్లను సర్కారు ప్రోత్సహిస్తోంది. వీరి వల్ల బేటీ, మటీ, రోటీ(కూతురు, భూమి, రొట్టె)కి ముప్పు ఏర్పడింది’ అని చెప్పారు.

Similar News

News November 18, 2024

మా నాన్న బెల్టు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్

image

తన బాల్యం బాధాకరంగా ఉండేదని బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా వెల్లడించారు. తండ్రి నియంతలా ఉండేవారని, తనను చెప్పులు, బెల్టులతో కొట్టేవారని తెలిపారు. ఓసారి తాను సిగరెట్ తాగకపోయినా షర్ట్ ఆ స్మెల్ రావడంతో విపరీతంగా కొట్టారని చెప్పారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘నేను, భార్య తహీరా ట్వంటీస్‌లోనే పేరెంట్స్ అయ్యాం. నా తండ్రితో పోలిస్తే నేను భిన్నమైన ఫాదర్‌ను. ఫ్రెండ్లీగా ఉంటా’ అని పేర్కొన్నారు.

News November 18, 2024

BJP రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నా: అర్వింద్

image

TG: తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని పాతబస్తీ నుంచే మొదలుపెట్టాలని, కాంగ్రెస్ బుల్డోజర్లకు అక్కడికి వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ KTRది మేకపోతు గాంభీర్యమని, ఆయన అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరమా అని నిలదీశారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి కల్వకుంట్ల కుటుంబం పనే అని ఆరోపించారు.

News November 18, 2024

రాష్ట్రంలో ఇంటింటి సర్వే 65.02% పూర్తి

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా 75,75,647 నివాసాల్లో సమగ్ర సర్వే పూర్తి అయింది. దీంతో ఇంటింటి కుటుంబ సర్వే 65.02 శాతం పూర్తి అయినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ములుగు జిల్లా 95.3శాతంతో తొలి స్థానంలో నిలిచింది. నల్గొండ 89.1, జనగామ 86 శాతం సర్వేతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. GHMCలో అతి తక్కువగా 44.3 శాతం సర్వే పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.