News November 18, 2024

కర్నూలు: టెన్త్ ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 26వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలస్య రుసుం రూ.50 చెల్లింపుతో డిసెంబర్ 2 వరకు, రూ.200 రుసుంతో 9, రూ.500 రుసుంతో డిసెంబర్ 26వ వరకు గడువు ఉందని తెలిపారు.

Similar News

News April 3, 2026

విషాదం.. లారీ బోల్తా పడి రైతు మృతి

image

మంత్రాలయం మండలం రచ్చమర్రిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యాకోబు గుంటూరులో మిరపకాయలు అమ్ముకుని తిరుగు ప్రయాణంలో ఆత్మకూరు ఘాట్ వద్ద లారీ బోల్తా పడటంతో బియ్యం సంచులు మీద పడి మృతి చెందాడు. కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని పలువురు ప్రజా సంఘాలు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

News April 3, 2026

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం: కలెక్టర్

image

భూసారాన్ని పెంచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి శిక్షణలో రైతులకు PMDS, గ్రీన్ మేన్యూర్ పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. పంటల వైవిధ్యం, ఉద్యాన పంటల సాగు, మల్లె సాగు విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు.