News November 18, 2024

బీమా యోజనపై అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ

image

నరసరావుపేట: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి గడువు డిసెంబర్ 31వ తేదీతో ముగుస్తుందని కలెక్టర్ అరుణ్ బాబు చెప్పారు. సోమవారం కలెక్టరేట్లో రబీ 2024 -25 సీజన్‌కు సంబంధించి బీమా యోజనపై అవగాహన కల్పించే గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. నేషనల్ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 4, 2024

పల్నాటి మహా వీరుడు.. మాల కన్నమదాసు

image

11వ శతాబ్దంలో మహాభారతాన్ని తలపించిన పల్నాటి యుద్ధం ఓ మహావీరుని విజయానికి ప్రతీక అని చరిత్ర చెబుతుంది. అతడే మాచర్ల రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడు.. అతి వీర భయంకరుడు ‘మాల కన్నమదాసు’. బ్రహ్మనాయుడి దత్తపుత్రునిగా రాజాజ్ఞను పాటిస్తూ సైన్యాన్ని నడిపించి బ్రహ్మన్న సహకారంతో నాగమ్మను ఓడించి మాచర్లకు విజయాన్ని చేకూర్చాడని చరిత్రలో లిఖించబడింది. యుద్ధంలో కన్నమదాసు వాడిన భైరవ ఖడ్గం నేటికీ పూజలందుకోవడం విశేషం.

News December 4, 2024

అమరావతి ప్రాంతంలో కంపించిన భూమి

image

గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు, పరిసర ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లాలో పలుచోట్ల నాలుగు సెకన్ల పాటు రెండుసార్లు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మీ ప్రాంతంలో ఎక్కడైనా కంపించిందా కామెంట్ చేయండి.

News December 4, 2024

డ్రోన్ల వినియోగం విస్తృతం చేయండి: సీఎం 

image

అమరావతి: భద్రత, నేర నియంత్రణ, ప్రజా సేవలకు డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో డ్రోన్ డెమోను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిర్వహణ, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలకు మందుల పంపిణీ, పారిశుద్ధ్య చర్యల కోసం డ్రోన్లను వినియోగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను కోరారు.