News November 18, 2024
‘బరి తెగించిపోతున్నాడు’ అంటే?

ఎవరైనా హద్దుమీరి మాట్లాడినా, చెప్పిన మాటలను లెక్కచేయకున్నా.. బరితెగించి పోతున్నాడు అంటాం. అసలు బరి అంటే ఏంటో తెలుసా? కుస్తీలో పోరాడవలసిన స్థల పరిమితులను బరి అని పిలుస్తుంటారు. దానిని దాటిన వ్యక్తి బరితెగించి పోతున్నాడు అంటారు. సమాజంలో ఉన్నప్పుడు కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అలాంటి వ్యక్తులను బరితెగించి పోతున్నాడు అని అంటుంటారు.
Similar News
News April 18, 2026
పిల్లలతో నయన్, విఘ్నేశ్ క్యూట్ పిక్స్

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ కవల పిల్లలతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ ఖాళీ సమయంలో ఉయిర్, ఉలగ్‌లతో ఈ జంట సరదాగా గడిపారు. తమ చిన్నారుల అల్లరికి సంబంధించిన చిత్రాలను షేర్ చేయగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. సెలబ్రిటీ పేరెంట్స్‌గా వారు పంచుకున్న ఈ మధుర క్షణాలు ట్రెండింగ్‌లో నిలిచాయి.
News April 18, 2026
అప్పుల్లో గేల్.. తానే సాయం చేశానన్న లలిత్ మోదీ

2011 ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన గేల్‌ను జట్టులోకి తీసుకొమ్మని RCBకి చెప్పింది తానేనని IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వెల్లడించారు. ‘వేలంలో గేల్ అమ్ముడుపోలేదు. ఎన్ని ఫ్రాంచైజీలను సంప్రదించినా నో అన్నారని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పులున్నాయి.. ఎలాగైనా ఆడాలని అన్నాడు. ఇంజూరీ ప్లేయర్ స్థానంలో తీసుకొమ్మని విజయ్ మాల్యాను రిక్వెస్ట్ చేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2011లో గేల్ 608 రన్స్ చేశారు.
News April 18, 2026
బోల్డ్ ఫొటోకు కోహ్లీ లైక్.. మోడల్ ఏమన్నారంటే?

విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా ఫొటోను <<19671107>>లైక్<<>> చేసి తర్వాత అన్‌లైక్ చేయడంపై జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ స్పందించారు. ‘విరాట్ నా ఫొటోకి లైక్ చేసినప్పుడు ఎంతో సంతోషించా. దానివల్ల SMలో ఇంతగా వైరల్ అవుతానని అనుకోలేదు. ఆ ఫొటోకు లైక్ చేయడంలో ఆయనకు దురుద్దేశం లేకపోయినా నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది చూసి ఆయనపై కాస్త జాలి కలిగింది. కోహ్లీ నుంచి లభించిన మద్దతుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.


