News November 18, 2024
కొణతం దిలీప్ అరెస్టు.. తీవ్రంగా ఖండించిన హరీశ్‌రావు
తెలంగాణ మాజీ డిజిటల్ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన దిలీప్ కొణతంను అరెస్టు చేసిన పోలీసులు తెలిపారు. కొణతం దిలీప్ అరెస్టును హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలని అన్నారు. దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Similar News
News November 19, 2024
ఢిల్లీ పరిస్థితి తెలంగాణలో రావద్దనే ఈవి పాలసీ: మంత్రి పొన్నం
డిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని, అలాంటి పరిస్థితి తెలంగాణలో రావద్దనే ఈవీ పాలసీ తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు X వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉందన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామన్నారు.
News November 19, 2024
కేసీఆర్ అంటే ఒక చరిత్ర: హరీశ్ రావు
కేసీఆర్ అంటే ఒక చరిత్ర అని.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అద్భుతంగా అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రాత్రి కేసీఆర్ ఫ్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి హీరో రజనీకాంత్ న్యూయార్క్‌లో ఉన్నానా.. ఇండియాలో ఉన్నానా అన్నాడన్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా KCR అభివృద్ధి చేశాడన్నారు.
News November 19, 2024
పాపన్నపేట: బైక్ అదుపు తప్పి ఒకరు మృతి
వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలంలో జరిగింది. ఏఎస్ఐ సంగన్న తెలిపిన వివరాలు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన బైండ్ల జశ్వంత్(19) అదే గ్రామానికి చెందిన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై పాపన్నపేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా యూసుఫ్ పేట గ్రామ శివారులో వాహనం అదుపుతప్పి కింద పడ్డారు. జశ్వంత్ మృతి చెందగా మరోకరికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.