News November 18, 2024

ఎల్.కోట: అసిస్టెంట్ రైటర్ సస్పెండ్

image

ఎల్.కోట మండలం భీమాలిలో ఇటీవల కోడి పందేలను నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన ఘటనలో విచారణ కొనసాగుతుందని DIG గోపీనాథ్ జెట్టీ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బాధ్యులైన పోలీసులపై చర్యలు తప్పవన్నారు. కోడిపందేల స్థావరంపై రైడ్ చేసిన పోలీసులు కేసులు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించారని SP విచారణలో వెల్లడి కావడంతో ఎల్.కోట అసిస్టెంట్ రైటర్ జీ.సత్యనారాయణను సస్పెండ్ చేశామన్నారు.

Similar News

News November 19, 2024

VZM: ‘చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలి’

image

విజయనగరం జిల్లాలోని వాగులు గెడ్డలపై చెక్ డ్యామ్‌లు నిర్మించేందుకు వారం రోజుల్లోగా ప్రతిపాదనలు సమర్పించాలని జలవనరుల శాఖ అధికారులను కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం ఆ శాఖ ఇంజినీర్లతో తన కార్యాలయంలో సమీక్షించారు. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న భూముల్లో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను తనకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రాజెక్టుల మరమ్మతులు నిర్వహణ పనుల కోసం మంజూరైన నిధుల వివరాలు చెప్పాలన్నారు.

News November 18, 2024

VZM: హైదరాబాద్‌లో రైస్ బ్యాగులు కొనుగోలు..!

image

విజయనగరం PW మార్కెట్లో తక్కువ రకం బియ్యాన్ని బ్రాండెడ్ కవర్లలో నింపి విక్రయిస్తున్న షాపుపై పోలీసులు రైడ్ చేసిన సంగతి తెలిసిందే. జయలక్ష్మి ట్రేడర్స్ షాపు ప్రతినిధి పెంటపాటి ఈశ్వర వెంకట్(రాజా) హైదరాబాద్‌లో పద్మావతి పాలీసాక్స్‌ను నడుపుతున్న శ్రీనివాస్ నుంచి కాలీ బ్రాండెడ్ రైస్ కవర్లు కొని తక్కువ రకం బియ్యాన్ని నింపుతున్నట్లు గుర్తించామని ఎస్ఐ నరేశ్ తెలిపారు. 

News November 17, 2024

విజయనగరంలో విద్యార్థిని సూసైడ్

image

విజయనగరంలోని పడాల్ పేటకు చెందిన విద్యార్ధిని సూసైడ్ చేసుకుంది. రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ వివరాల ప్రకారం.. వీర వెంకట లక్ష్మి (19) మైగ్రేన్ సమస్యలతో బాధపడుతోందన్నారు. ఈనెల 13న నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగేసిందని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.