News November 19, 2024
బ్యాంకులో 592 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల(కాంట్రాక్ట్)కు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. పోస్టును బట్టి బీఈ/బీటెక్/డిగ్రీ/ఎంబీఏ/పీజీ చేసిన వారు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, EWS,OBC అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.100 ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం <
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in
Similar News
News April 18, 2026
‘పదహారణాల’ తెలుగమ్మాయి అంటే?

అచ్చమైన తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తే పదహారణాల తెలుగమ్మాయి అని అంటాం. ఒక కంప్లీట్ ఉమెన్ అని అర్థం. పూర్వం 16 అణాలు కలిస్తే ఒక పూర్తి రూపాయి. తన భాష, భావన, నడక, నడత, ఆహార్యం, వస్త్ర ధారణ తదితర 16 అంశాల్లో తెలుగుదనాన్ని నింపుకున్న అమ్మాయిని మన కవులు ఇలా పోల్చారు.
* ఒక బేడా= 2 అణాలు. ఒక పరకా=1/2 అణా, ఒక కాని=1/4 అణా, ఒక దమ్మిడి= 1/12 అణా.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 18, 2026
కాసేపట్లో వర్షం..

TG: హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్, నాంపల్లి, అబిడ్స్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, చార్మినార్, అల్వాల్, కాప్రా, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వాన పడుతుందని తెలిపారు. అటు సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం పడుతుందని పేర్కొన్నారు.
News April 18, 2026
డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుంది?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 శాతం <<19682000>>డీఏ పెంపుతో<<>> కరవు భత్యం 60 శాతానికి చేరింది. దీంతో జీతం ఎంత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్ శాలరీ రూ.30,000 ఉంటే 58 శాతం డీఏకు రూ.17.400, 60 శాతం డీఏకు రూ.18,000 వస్తుంది. అంటే ప్రతి రూ.30వేలకు రూ.600 అధికమవుతుంది. ఇక పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. అరియర్స్‌ను వచ్చే 3 నెలల జీతంతో కలిపి ఇచ్చే అవకాశం ఉంది.


