News November 19, 2024
వరంగల్‌కు వరాల జల్లు (1/2)
ప్రజాపాలన విజయోత్సవ వేడుకల వేళ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరాల జల్లు కురిపించింది.
* వరంగల్ మహానగర అభివృద్ధికి రూ.4962.47కోట్లు
* వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170కోట్లు
* కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు రూ.160.92కోట్లు
* టెక్స్‌టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలకు రూ.33.60కోట్లు
* పార్క్‌కు భూములిచ్చిన రైతులకు 863ఇళ్లు, రూ.43.15 కోట్ల పరిహారం
Similar News
News November 19, 2024
ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి?: వైసీపీ
AP: రాష్ట్రంలో ఆడబిడ్డలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని YCP విమర్శించింది. బాపట్లలో మతిస్థిమితం లేని 11 ఏళ్ల బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారని, నిందితుడిని పోలీసులకు అప్పగించారని ట్వీట్ చేసింది. ‘మీ చేతగానితనంతో ఇంకెంత మంది ఆడబిడ్డలు ఇలాంటి కామాంధులకి బలవ్వాలి?’ అని CM CBN, Dy.CM పవన్, హోంమంత్రి అనితను ప్రశ్నించింది.
News November 19, 2024
‘కంగువ’ సినిమా రన్ టైమ్ తగ్గింపు
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమా రన్ టైమ్‌ను మేకర్స్ 12 నిమిషాలు తగ్గించారు. తొలుత సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉండగా, ఇప్పుడు మళ్లీ సెన్సార్ చేయించి 2 గంటల 22 నిమిషాలకు తగ్గించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. గోవా బ్యాక్ డ్రాప్‌లో జరిగే కొన్ని సీన్లను తొలగించినట్లు సమాచారం. ఈనెల 14న విడుదలైన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
News November 19, 2024
13.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
TG: రాష్ట్రంలో 13.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలంగాణ పౌరసరఫరాల కమిషనర్ చౌహాన్ తెలిపారు. మరో 57లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 7,532 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. ఓపెన్ మార్కెట్ వల్ల సన్నరకం ధాన్యం సేకరణ తగ్గిందని వివరించారు. ఈ నెల 23వరకు 90శాతం బోనస్ చెల్లిస్తామని చౌహాన్ వెల్లడించారు.