News November 19, 2024
అనకాపల్లి: ‘మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం చూపాలి’
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మండల స్థాయిలో నిర్వహిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను జిల్లా స్థాయికి తీసుకురావద్దన్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News November 21, 2024
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై రావికమతంలో కేసు నమోదు
సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని SI ఎం.రఘువర్మ గురువారం తెలిపారు. 2024 మే 2న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారని గుడ్డిప గ్రామానికి చెందిన గల్లా నాని బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వర్మకు నోటీసులు స్వయంగా అందజేశామన్నారు.
News November 21, 2024
విశాఖ డెయిరీ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ డెయిరీ ఉద్యోగులు అక్కిరెడ్డిపాలెం డెయిరీ ముందు గురువారం రిలే నిరాహార దీక్షకు దిగారు. విశాఖ కో-ఆపరేటివ్ డెయిరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కేవివి మూర్తి, కార్యదర్శి ఎస్.రమణ మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.21వేలకు పెంచాలన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా బోనస్, ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. అగ్రిమెంట్ పద్ధతిపై ఉన్న ఉద్యోగులందర్నీ రెగ్యులర్ చేయాలన్నారు.
News November 21, 2024
5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్
5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. విశాఖలో ఐటీ హిల్స్‌పై రాబోయే 3 నెలల్లో రెండు ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిక్సీతో పాటు సింగపూర్ నుంచి సీ లైనింగ్ కేబుల్‌ను విశాఖకు తీసుకొచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.