News November 19, 2024

పిట్లం: నేడే AMC పాలకవర్గ ప్రమాణ స్వీకారం

image

పిట్లం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి.. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ చికోటి మనోజ్, కృష్ణారెడ్డి కోరారు.

Similar News

News April 16, 2026

NZB: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు: DCC అధ్యక్షుడు

image

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పసుపు రైతులకు ఇబ్బందులు అని కాంగ్రెస్ NZB జిల్లా అధ్యక్షుడు నగేశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పసుపు కొనుగోళ్ల కోసం కొత్తగా తెచ్చిన 0.2 సాఫ్ట్‌వేర్‌లో NZB మార్కెట్‌ను చేర్చకపోవడం బీజేపీ కుట్రని, దీని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.

News April 16, 2026

నిజామాబాద్‌ ప్రీమియర్ లీగ్ – 2026.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం

image

NZB సెక్యూరిటీ కౌన్సిల్ (NSC), పోలీస్ ఆధ్వర్యంలో ‘నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ – 2026’ పేరుతో ఈ నెల 20-28 వరకు నిర్వహించబోయే క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, యోగా పోటీల్లో పాల్గొనేవారు. 11-17 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. క్రికెట్ కోసం: 9533256063, 9502929737, వాలీబాల్: 9440711635, బాస్కెట్ బాల్: 9440404424, కబడ్డీ: 98667 70889, యోగా: 9848420803 సంప్రదించాలన్నారు.

News April 16, 2026

సిరికొండ: ప్రజా సమస్యల పరిష్కారంపై సమీక్ష

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సిరికొండ మండలంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎవరైతే జిల్లా నాయకులు, మండల రైతులు ప్రజలు, సర్పంచులు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.