News November 19, 2024
13.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
TG: రాష్ట్రంలో 13.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలంగాణ పౌరసరఫరాల కమిషనర్ చౌహాన్ తెలిపారు. మరో 57లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 7,532 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. ఓపెన్ మార్కెట్ వల్ల సన్నరకం ధాన్యం సేకరణ తగ్గిందని వివరించారు. ఈ నెల 23వరకు 90శాతం బోనస్ చెల్లిస్తామని చౌహాన్ వెల్లడించారు.
Similar News
News November 19, 2024
సన్నబియ్యం పంపిణీ ఆలస్యం!
TG: రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని అధికారులు తెలిపారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో ఉగాది నుంచి ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉంది.
News November 19, 2024
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ అప్‌డేట్స్
☛ ఈనెల 23 నుంచి మ్యాచులు ప్రారంభం, DEC 15న ఫైనల్
☛ ముంబై కెప్టెన్‌గా శ్రేయస్. జట్టులో రహానె, పృథ్వీ షా, శార్దూల్‌కు చోటు
☛ బెంగాల్ జట్టుకు ఎంపికైన మహ్మద్ షమీ
☛ UP కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్, జట్టులో సభ్యులుగా రింకూ సింగ్, నితీశ్ రాణా, యశ్ దయాల్, మోసిన్ ఖాన్.
☛ HYD టీమ్ కెప్టెన్‌గా తిలక్ వర్మ, కర్ణాటక కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్
☛ జియో సినిమా యాప్‌లో లైవ్ మ్యాచులు .
News November 19, 2024
అరకులో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 8.9 డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోని తిర్యాణి (ఆసిఫాబాద్), జహీరాబాద్ (సంగారెడ్డి)లో 12.1 టెంపరేచర్ రికార్డయింది. హైదరాబాద్ BHELలో 13.3 డిగ్రీలుగా ఉంది. నవంబర్ 28 వరకు చలి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.