News November 19, 2024
నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్!
TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. రూ.2వేలకోట్ల బకాయిలు విడుదల చేసే వరకూ కాలేజీల బంద్‌ను కొనసాగిస్తామని, సెమిస్టర్ పరీక్షలనూ బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఈ బంద్‌లో కాలేజీలు పాల్గొనాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.
Similar News
News November 19, 2024
బేబీ బంప్‌తో అతియా శెట్టి.. పిక్స్ వైరల్
టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి బేబీ బంప్‌తో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఇటీవలే రాహుల్-అతియా జంట ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వీరికి బిడ్డ జన్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. కాగా రాహుల్-అతియా గతేడాది వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నారు.
News November 19, 2024
షేర్లు కొనేందుకు సరైన టైమ్ ఏదంటే..
మంచి పోర్టుఫోలియో నిర్మాణానికి స్టాక్ మార్కెట్లు, ఎకానమీపై బ్యాడ్ న్యూస్ విపరీతంగా వస్తున్న కాలమే సరైందని ABSL AMC MD బాలసుబ్రహ్మణ్యం అన్నారు. బలమైన ఫండమెంటల్స్ కలిగిన షేర్లు అప్పుడే తక్కువ ధరకు దొరుకుతాయన్నారు. భారత $10 ట్రిలియన్ల కల ఈ 4 నెలలతో చెదిరిపోదని, బలమైన క్రెడిట్ గ్రోత్ ఎకానమీని నడిపిస్తుందని తెలిపారు. బ్యాంకింగ్ సెక్టార్లో స్టాక్స్ కొనొచ్చని, ఎకానమీ పెరగ్గానే ఇవి లాభాలు ఇస్తాయన్నారు.
News November 19, 2024
‘పుష్ప 2’ టికెట్ ధరలు భారీగా పెంపు?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. టికెట్ రేట్లు పెంచేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం APలో నగరాల్లో రూ.150-200 ఉన్న టికెట్ రేటును రూ.300కు పెంచేందుకు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు టాక్. దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.