News November 19, 2024
అరకులో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 8.9 డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోని తిర్యాణి (ఆసిఫాబాద్), జహీరాబాద్ (సంగారెడ్డి)లో 12.1 టెంపరేచర్ రికార్డయింది. హైదరాబాద్ BHELలో 13.3 డిగ్రీలుగా ఉంది. నవంబర్ 28 వరకు చలి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
Similar News
News November 19, 2024
నారా రోహిత్‌కు ప్రధాని మోదీ లేఖ
టాలీవుడ్ హీరో నారా రోహిత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడి మృతికి ప్రధాని సంతాపం తెలిపారు. రామ్మూర్తి అందరినీ విడిచి వెళ్లినా, కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ విషాదం నుంచి రోహిత్ త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా నిలబడాలని ఆయన కోరుకున్నారు. ఇందుకు ప్రధాని మోదీకి రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు.
News November 19, 2024
‘నువ్వు బతికి వేస్ట్.. చచ్చిపో’ అనడంతో యువతి ఆత్మహత్య
TG: తెలిసిన యువకుడు వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేయడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగింది. హాసిని(20)కి నిఖిల్‌తో ఇంటర్‌లో పరిచయం ఏర్పడింది. తరచూ ఆమెకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతూ వేధించేవాడు. ఆమె ఇన్‌స్టా అకౌంట్‌ను హ్యాక్ చేసి పోస్టులు పెట్టేవాడు. తాజాగా ఆమెను ‘నువ్వు బతికి వేస్ట్.. చచ్చిపో’ అని అనడంతో పాటు అసభ్యంగా దూషించడంతో హాసిని సూసైడ్ చేసుకుంది.
News November 19, 2024
నాకు 4 రోజులు టైం కావాలి.. పోలీసులకు RGV మెసేజ్
AP: తనపై నమోదైన కేసులో రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. తనకు 4 రోజులు సమయం కావాలంటూ ఒంగోలు పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లపై ఆర్జీవీ అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా 5 రోజుల క్రితం పోలీసులు HYDకు వచ్చి RGVకి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఆయన ఒంగోలు సీఐ కార్యాలయానికి రావాల్సి ఉంది.