News November 19, 2024

రేపు MGUలో మెగా జాబ్ మేళా

image

రేపు ఎంజీయూలోని ఆర్ట్స్ బ్లాక్ సెమినార్ హాల్లో ఉదయం 9:30 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై. ప్రశాంతి తెలిపారు. 10th, ఇంటర్, ఏదైనా UG, ఏదైనా PG, B.Tech & M.Tech పాస్ అయిన విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. జాబ్ మేళాలో ఐటి, నాన్ ఐటికి సంబంధించి సాఫ్ట్వేర్ సంస్థలు, ఫార్మసీ కంపెనీలు పాల్గొంటాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News April 17, 2026

హైదరాబాద్-సాగర్ రహదారిపై కారు లారీ ఢీ వ్యక్తి మృతి

image

హైదరాబాద్-సాగర్ రహదారిపై కారు, లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్‌కు చెందిన గిరిధర్ గౌడ్ మల్లెపల్లి నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తున్న క్రమంలో పోలేపల్లి(రాంనగర్) వద్ద లారీ ఢీకొనడంతో కారులో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి అవినాష్‌కు తీవ్రగాయాలు అవ్వడంతో మాల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మూర్తి తెలిపారు.

News April 17, 2026

NLG: రేషన్ సమస్యలు.. రెండు రోజుల్లో పరిష్కారం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిల్వలు ముగిసి రేషన్ దుకాణాలు మూతపడుతున్నాయన్న వార్తలపై జిల్లా పౌరసరఫరాల అధికారులు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ కోటా కింద NLGతో పాటు KMM, మహబూబాబాద్ జిల్లాలకు ప్రభుత్వం ఇప్పటికే బియ్యం కేటాయించిందని, అందులో సగం రవాణా పూర్తయిందని తెలిపారు. మరో రెండు రోజుల్లో రవాణా ప్రక్రియను పూర్తిస్థాయిలో ముగించి, నిల్వలు లేక మూతపడిన దుకాణాలకు బియ్యాన్ని చేరవేస్తామన్నారు.

News April 17, 2026

ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. శుక్రవారం MLGలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాలలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఒక్క మిర్యాలగూడ డివిజన్ పరిధిలోనే 93 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఎస్పీ పిలుపునిచ్చారు.