News November 19, 2024
కానుగ ఆకుపై ఇందిరా గాంధీ చిత్రం

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కానుగ చెట్టు ఆకుపై ఆమె చిత్రాన్ని విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ పెంచలయ్య గీశారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన ఈయన.. పలువురి ప్రముఖులు చిత్రాలను వివిధ రకాల ఆకులపై గీసేవారు. మంగళవారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రాన్ని కానుగ ఆకుపై చిత్రీకరించి అబ్బురపరిచారు.
Similar News
News January 18, 2026
నెల్లూరు: 9లక్షలకు పైగానే ఫ్రీ బస్ ఎక్కారు..!

సంక్రాంతి కావడంతో ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడాయి. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టాక వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో మహిళలు సొంతూళ్లకు ఉచితంగా ప్రయాణం చేశారు. ఈనెల 8 నుంచి 16వ వరకు నెల్లూరు జిల్లాలోని 7 డిపోల పరిధిలో 9,55,083 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇందుకు గాను ప్రభుత్వంపై రూ.3,89,85,130 భారం పడింది.
News January 18, 2026
వాహనదారులకు నెల్లూరు ఎస్పీ సూచనలు

నెల్లూరు జిల్లాలో పొగ మంచు ఎక్కువైంది. ఈక్రమంలో వాహనదారులకు ఎస్పీ డా.అజిత వేజెండ్ల పలు సూచనలు చేశారు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగించాలన్నారు. వాహనాల మధ్య దూరం పాటించాలని కోరారు. హజార్డ్ లైట్స్ ఆన్ చేయడంతో పాటు, డి ఫాగర్ ఆన్‌లో ఉంచాలన్నారు. ఈ నియమాలను పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
News January 18, 2026
నెల్లూరోళ్లు రూ.23.17 కోట్ల మద్యం తాగేశారు..!

నెల్లూరు జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. 3రోజులు ప్రజలు ఆహ్లాదంగా గడిపారు. మందుబాబులు మత్తులో మునిగి తేలారు. ఫలితంగా జిల్లాలోని వైన్ షాపులన్నీ కిటకిటలాడాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా జిల్లా అంతటా మద్యం ఏరులైపారింది. 14 నుంచి 16వ తేదీ రాత్రి వరకు రూ.23.17 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ. 2.06. కోట్ల మేర వ్యాపారం జరిగింది.


