News November 19, 2024

కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినేనా?

image

హీరోయిన్ కీర్తి సురేశ్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తటిల్‌‌తో ఆమె వివాహం డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో జరగనున్నట్లు తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. 15 ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఆంటోనీ దుబాయ్‌లో వ్యాపారం చేస్తారని సమాచారం. పెళ్లి వార్తలపై కీర్తి సురేశ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News April 17, 2026

తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు: హార్దిక్

image

IPL 2026లో MI వరుసగా 4వ మ్యాచ్‌లోనూ ఓటమి పాలవడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చెప్పడానికి ఏం లేదు. తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావడం లేదు. జట్టుగా విఫలమవుతున్నామా లేక ఆటగాళ్ల వ్యక్తిగత తప్పిదాలా? ప్లానింగ్‌లో లోపముందా? ఆలోచించుకొని తర్వాత ఏం చేయాలో చూస్తాం’ అని నిన్న PBKSతో ఓటమి తర్వాత అన్నారు. MI ఫెయిల్యూర్‌పై మీ అభిప్రాయం ఏంటి? Comment

News April 17, 2026

బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామందిలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యల ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. దీనికోసం ఆహారంలో బియ్యం, మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.

News April 17, 2026

పడిపోయిన బొప్పాయి ధరలు

image

AP: యుద్ధం వల్ల అరబ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంలో బొప్పాయి ధరలు పడిపోయాయి. 2 వారాల కిందట టన్నుకు రూ.13 వేల వరకు ఉన్న ధర ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. ఇప్పటికే అకాల వర్షాలు, వైరస్, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 30-40 టన్నులు రావాల్సి ఉండగా 10-15 టన్నుల పంటే చేతికి వచ్చింది. అటు దిగుబడి, ఇటు రేటు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తోటల్లోనే కాయలు పండిపోతున్నాయి.