News November 19, 2024

ఇందిరా గాంధీకి మోదీ నివాళి

image

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి అర్పించారు. అలాగే రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగానూ ఆయన ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆమె చూసిన ధైర్యసాహసాలు ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకమని మోదీ కొనియాడారు. కష్టకాలంలో ఆమె నాయకత్వం నిజమైన సంకల్పం ఏమిటో చూపించిందన్నారు.

Similar News

News November 19, 2024

అత్యాచారం కేసులో నటుడికి ముందస్తు బెయిల్

image

లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు సిద్దిఖ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు అత్యున్నత ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో సమర్పించి, విచారణకు సహకరించాలని ఆదేశించింది. మరోవైపు సిద్దిఖ్‌పై ఫిర్యాదు చేయడానికి 8 ఏళ్లు ఎందుకు పట్టిందని బాధితురాలి లాయర్‌ను కోర్టు ప్రశ్నించింది. కాగా సిద్దిఖ్ తనపై 2016లో అత్యాచారం చేశాడని ఓ నటి ఈ ఏడాది ఆగస్టులో ఫిర్యాదు చేశారు.

News November 19, 2024

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?

image

తాము అందిస్తున్న లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యాపైకి ప్రయోగించేందుకు అమెరికా ఉక్రెయిన్‌కు పర్మిషన్ ఇవ్వడం సంచలనం రేపుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని రష్యా మండిపడింది. తమ దేశం పైకి క్షిపణులు వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం నాటో దేశాలకు విస్తరిస్తుందనే ఆందోళన నెలకొంది. పౌరులు నిత్యావసరాలు, ఔషధాలు నిల్వ ఉంచుకోవాలని నార్వే, ఫిన్లాండ్ సూచించాయి.

News November 19, 2024

ఎంత పని చేశావయ్యా బైడెన్!

image

తాను గెలిస్తే యుద్ధాలు ఆపేస్తానని కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. కానీ మరో 60 రోజుల్లో కుర్చీ నుంచి దిగిపోనున్న బైడెన్ పెద్ద చిచ్చే పెట్టారని అంతర్జాతీయ నిపుణులు ఫైరవుతున్నారు. లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యాపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు పర్మిషన్ ఇవ్వడమే దీనికి కారణం. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బైడెన్ చెప్పారు. ఒకవేళ మిస్సైల్స్ ప్రయోగిస్తే రష్యా ఊరుకోదు.