News November 19, 2024
షేర్లు కొనేందుకు సరైన టైమ్ ఏదంటే..
మంచి పోర్టుఫోలియో నిర్మాణానికి స్టాక్ మార్కెట్లు, ఎకానమీపై బ్యాడ్ న్యూస్ విపరీతంగా వస్తున్న కాలమే సరైందని ABSL AMC MD బాలసుబ్రహ్మణ్యం అన్నారు. బలమైన ఫండమెంటల్స్ కలిగిన షేర్లు అప్పుడే తక్కువ ధరకు దొరుకుతాయన్నారు. భారత $10 ట్రిలియన్ల కల ఈ 4 నెలలతో చెదిరిపోదని, బలమైన క్రెడిట్ గ్రోత్ ఎకానమీని నడిపిస్తుందని తెలిపారు. బ్యాంకింగ్ సెక్టార్లో స్టాక్స్ కొనొచ్చని, ఎకానమీ పెరగ్గానే ఇవి లాభాలు ఇస్తాయన్నారు.
Similar News
News November 19, 2024
వరంగల్ దశ,దిశ మార్చేందుకు వస్తున్నా: రేవంత్
వరంగల్ బయల్దేరిన CM రేవంత్ ‘X’లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ చైతన్య రాజధాని, కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సార్‌కు జన్మనిచ్చిన గడ్డ. హక్కుల కోసం పోరాడిన సమ్మక్క, సారలమ్మలు నడయాడిన ప్రాంతం. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్. వీరి స్ఫూర్తితో మన భవిత కోసం వరంగల్ దశ,దిశ మార్చేందుకు వస్తున్నా’ అని పేర్కొన్నారు.
News November 19, 2024
రూ.100 కోట్ల సైబర్ ఫ్రాడ్‌స్టర్ అరెస్ట్: APతో లింక్
వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లకు పాల్పడ్డ చైనా పౌరుడు ఫాంగ్ చెంజిన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రూ.43.5 లక్షల మోసం కేసులో దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అతడి స్కామ్‌ల విలువ రూ.100 కోట్లు దాటేసినట్టు కనుగొన్నారు. ముఖ్యంగా AP, UPల్లో సైబర్ క్రైమ్స్, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించారు. CCPలో అతడిపై నమోదైన 17 కేసులు ఫిన్‌కేర్ బ్యాంక్ A/Cకు లింకైనట్టు తెలిపారు.
News November 19, 2024
పౌరసత్వాన్ని వదులుకొని..!
మెరుగైన అవకాశాలు, సౌకర్యాల కోసం ఏటా చాలా మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు పయనమవుతున్నారు. అయితే, వారు వెళ్లిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. అవేంటంటే.. స్వచ్ఛమైన గాలి & నీరు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, హైక్లాస్ ప్రజా రవాణా అని నిపుణులు చెబుతున్నారు. 2023లో 2.16 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవడం గమనార్హం.