News November 19, 2024
నారా రోహిత్‌కు ప్రధాని మోదీ లేఖ
టాలీవుడ్ హీరో నారా రోహిత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడి మృతికి ప్రధాని సంతాపం తెలిపారు. రామ్మూర్తి అందరినీ విడిచి వెళ్లినా, కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ విషాదం నుంచి రోహిత్ త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా నిలబడాలని ఆయన కోరుకున్నారు. ఇందుకు ప్రధాని మోదీకి రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 19, 2024
రూ.100 కోట్ల సైబర్ ఫ్రాడ్‌స్టర్ అరెస్ట్: APతో లింక్
వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లకు పాల్పడ్డ చైనా పౌరుడు ఫాంగ్ చెంజిన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రూ.43.5 లక్షల మోసం కేసులో దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అతడి స్కామ్‌ల విలువ రూ.100 కోట్లు దాటేసినట్టు కనుగొన్నారు. ముఖ్యంగా AP, UPల్లో సైబర్ క్రైమ్స్, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించారు. CCPలో అతడిపై నమోదైన 17 కేసులు ఫిన్‌కేర్ బ్యాంక్ A/Cకు లింకైనట్టు తెలిపారు.
News November 19, 2024
పౌరసత్వాన్ని వదులుకొని..!
మెరుగైన అవకాశాలు, సౌకర్యాల కోసం ఏటా చాలా మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు పయనమవుతున్నారు. అయితే, వారు వెళ్లిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. అవేంటంటే.. స్వచ్ఛమైన గాలి & నీరు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, హైక్లాస్ ప్రజా రవాణా అని నిపుణులు చెబుతున్నారు. 2023లో 2.16 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవడం గమనార్హం.
News November 19, 2024
దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారు: భట్టి
TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై నెగటివ్ సినిమాలు తీసే వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తారని అన్నారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని భట్టి కొనియాడారు.