News November 19, 2024
‘అన్నదాత సుఖీభవ’కు బడ్జెట్ కేటాయించాం: అచ్చెన్నాయుడు
AP: త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులను రైతులకు ఇస్తామని, ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్‌లో రూ.4,500 కోట్లు కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మండలిలో YCP సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఏటా రైతులందరికీ రూ.20 వేలు అందజేస్తాం. ఇందులో PM కిసాన్ రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి ఇస్తాం. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 19, 2024
ఈరోజు నేను గర్వపడుతున్నా: పవన్
తక్కువ వ్యవధిలోనే 18 ఉమెన్ మిస్సింగ్ కేసులను ఛేదించినట్లు విజయవాడ పోలీసులు ట్వీట్ చేయగా DyCM పవన్ స్పందించారు. ‘YCP పాలనలో 30,000+ మహిళలు & బాలికలు తప్పిపోయారు. వారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. APలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ ఉండటంతో ఈరోజు విజయవాడ పోలీసులు ఈ కేసులను ఛేదించినందుకు నేను గర్వపడుతున్నా. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, పోలీసులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News November 19, 2024
అంతర్రాష్ట్ర బదిలీలపై AP మంత్రి కీలక ప్రకటన
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న AP, TGలోని ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. AP నుంచి 1,942, TG నుంచి 1,447 మంది బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీనిపై TG ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన కమిటీలో AP నుంచి మంత్రులు అనగాని, దుర్గేశ్, జనార్దన్, TG నుంచి భట్టి, శ్రీధర్, పొన్నం ఉన్నారన్నారు.
News November 19, 2024
మెలోనీ+మోడీ: మెలోడీ మీటింగ్
G20 సమ్మిట్ సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీరి సమావేశంపై నెటిజన్లు క్రియేటివ్‌గా స్పందిస్తున్నారు. ఇద్దరు PMల పేర్లు కలిపి ‘మెలోడీ మీటింగ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. డిఫెన్స్, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించినట్టు మోదీ తెలిపారు. ఇరు దేశాల మైత్రి ప్రపంచ సుస్థిరతకు మేలు చేస్తుందన్నారు.