News November 19, 2024
డబ్బు కోసమే ఢిల్లీ నన్ను వదులుకోలేదు: పంత్
డబ్బు కోసమే తనను ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకోలేదని, ఇది నిజం అని టీమ్ ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ ట్వీట్ చేశారు. కాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రిషభ్ పంత్ రూ.18 కోట్ల కంటే ఎక్కువ ఆశించినట్లుంది. అందుకే డీసీ వదిలేసి ఉంటుంది. కానీ మెగా వేలంలో అతడిని ఢిల్లీ మళ్లీ కచ్చితంగా దక్కించుకుంటుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పంత్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News December 1, 2024
బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ: అంబటి
AP: విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారంటీ.. ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ’ అని రాసుకొచ్చారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపైనా ఆయన సెటైర్లు వేశారు. ‘ప్రతి వైన్ షాపునకూ బెల్ట్ ఉంది.. బాబుకే బెల్ట్ లేదు తీయడానికి!’ అని రాసుకొచ్చారు.
News December 1, 2024
టీచర్ల బదిలీల రోడ్ మ్యాప్ ఇదే
AP: ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు. ఫిబ్రవరి 15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 10-15 వరకు HMలు, 21-25 వరకు SA, మే 1-10 వరకు SGTల బదిలీలు పూర్తిచేస్తారు. అలాగే ఏప్రిల్ 16-20 వరకు HMలు, మే 26-30 వరకు SAల ప్రమోషన్లు చేపడతారు.
News December 1, 2024
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
TG: ములుగు జిల్లా ఏటూరునాగారంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు సహా ఇతరులు ఉన్నట్లు సమాచారం.