News November 19, 2024

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?

image

తాము అందిస్తున్న లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యాపైకి ప్రయోగించేందుకు అమెరికా ఉక్రెయిన్‌కు పర్మిషన్ ఇవ్వడం సంచలనం రేపుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని రష్యా మండిపడింది. తమ దేశం పైకి క్షిపణులు వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం నాటో దేశాలకు విస్తరిస్తుందనే ఆందోళన నెలకొంది. పౌరులు నిత్యావసరాలు, ఔషధాలు నిల్వ ఉంచుకోవాలని నార్వే, ఫిన్లాండ్ సూచించాయి.

Similar News

News November 19, 2024

నేడు శాసనమండలిలో పలు బిల్లులకు ఆమోదం

image

AP: శాసనమండలి ఇవాళ పలు బిల్లులను ఆమోదించింది. ఏపీ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు-2024, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ల సవరణ బిల్లు, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లులకు మండలి ఆమోదం లభించింది. వీటితో పాటు బోర్డు సభ్యుల నియామకాల్లో వివక్ష చూపకుండా నిరోధిస్తూ 3 చట్టాల సవరణకు ఏపీ శాసనమండలి నిర్ణయం తీసుకుంది.

News November 19, 2024

త్వరలో భారత పర్యటనకు పుతిన్

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వ‌ర‌లో భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఈ విష‌యాన్ని క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ మంగళవారం వెల్ల‌డించారు. అయితే కచ్చిత‌మైన తేదీల‌పై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఇరు దేశాల మ‌ధ్య దీర్ఘ‌కాలిక భాగ‌స్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి పుతిన్ ప‌ర్య‌ట‌న దోహ‌దపడనుంది. ఇటీవల బ్రిక్స్ సదస్సు కోసం మోదీ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.

News November 19, 2024

కాంగ్రెస్ సంబరాలపై నవ్వుకుంటున్నారు: ఈటల

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. వరంగల్‌లో ప్రభుత్వం జరుపుకుంటున్న ఏడాది సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలుపై చర్చకు రేవంత్ సవాల్ స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ చర్చకు ప్రధాని అవసరం లేదని, ఎక్కడికి రావాలో చెబితే తాను వస్తానని చెప్పారు.